Chordyes

Devara Nee Deevenalu

Devara Nee Deevenalu Lyrics by Misc Praise Songs

Chorus దేవర నీ దేవెనలు - ధారళముగను వీరలపై బాగుగ వేగమె దిగనిమ్ము - పావన యేసుని ద్వారగను Verse 1 దంపతులు దండిగ నీ - ధాత్రిలో వెలయుచు సంపదలన్ సొంపుగ నింపుగ పెంపగుచు - సహింపున వీరు సుఖించుటకై Verse 2 ఈ కవను నీ కరుణన్ - ఆకరువరకును లోకములో శోకము లేకయె యేకముగాఁ - బ్రాకటముగను జేకొనుము Verse 3 ఇప్పగిది నెప్పుడును - గొప్పగు ప్రేమతో నొప్పుచు దా మొప్పిన చొప్పునఁ దప్పకను - మెప్పుగ బ్రతుకగఁ బంపు కృపన్ Verse 4 తాపములు పాపములు - మోపుగ వీరిపై రాకుండగాఁ గాపుగఁ బ్రాపుగ దాపునుండి - యాపద లన్నియుఁ బాపుచును Verse 5 సాధులుగన్ జేయుటకై - శోధనలచే నీవు శోధింపగాఁ కదలక వదలక ముదమున నీ - పాదము దాపునఁ బాదుకొనన్ Verse 6 మెండుగ భూ మండలపు - గండములలో వీరుండగను తండ్రిగ దండిగ నండనుండి - వెండియు వానిని ఖండించవే Verse 7 ఇద్దర వీ రిద్దరును - శుద్ధులై నిన్ను సేవించుటకై శ్రద్ధతో బుద్ధిగ సిద్ధ పడన్ - దిద్దుము నీ ప్రియ బిడ్డలుగాన్ Verse 8 వాసిగ నీ దాసులము - చేసిన యీ మొఱల్ దీసికొని మా సకలేశ్వర నీ సుతుఁడౌ - యేసుని పేరిటఁ బ్రోవు మామేన్