Intro
యేసయ్యా....నిన్ను చూడాలని ఆశ
మెస్సయ్యా.... నిన్ను చేరాలని ఆశ
యేసయ్యా....నిన్ను చూడాలని ఆశ
మెస్సయ్యా.... నిన్ను చేరాలని ఆశ
ఎవరు వున్నారు నాకు – ఈ లోకంలో
ఎవరు నాతోడు రారు – ఈ లోకంలో
ఇమ్మానుయేలైన – నా దైవం నీవేగా
ఇమ్మానుయేలైన – నా దైవం నీవేగా /యేసయ్య/
Verse 1
అందరు వున్నారని – అందరు నావారని
అందరు వున్నారని – అందరు నావారని
తలచితిని భ్రమసితిని – చివరికి ఒంటరి నేనైతిని
తలచితిని భ్రమసితిని – చివరికి ఒంటరి నేనైతిని
నా గానము నీవయ్యా – నా ధ్యానము నీవయ్యా
నా ప్రాణము నీవయ్యా – నా సర్వము నీవయ్యా /యేసయ్యా/
Verse 2
అంధకారములో అంధుడ నేనైతిని
అంధకారములో అంధుడ నేనైతిని
నిను చూసే నేత్రములు నాకొసగుమా నజరేయుడా
నిను చూసే నేత్రములు నాకొసగుమా నజరేయుడా
నా ఆశ నీవయ్యా – నా ధ్యాస నీవయ్యా
నా శ్వాశ నీవయ్యా – నా భాష నీవయ్యా /యేసయ్యా /